కె.పి.అగ్రహారం సర్పంచ్ బరిలో వైసీపీ అభ్యర్థి గోపిశెట్టి శ్రీను గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు.. మద్దతు కోరుతున్న శ్రీను

అనకాపల్లి జిల్లా డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి సీతా గణేష్

 

బుచ్చయ్యపేట మండలంలోని కె.పి.అగ్రహారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోపిశెట్టి శ్రీను పోటీకి సిద్ధమయ్యారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.గ్రామ అభివృద్ధి,మౌలిక సదుపాయాల కల్పన,ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.తనకు ఒక అవకాశం కల్పించి ఆశీర్వదించాలని,సర్పంచ్‌గా సేవ చేసే అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *