శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.. ఉదయం సత్యనారాయణ వ్రతం, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం..

రాజంపేట నవంబర్ 13- డెమోక్రసీ రైట్స్ :

 

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ కార్యక్రమం శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరగనున్నది.

 

కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు, వ్రతాలకు ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.

 

ఉదయం వేళ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించనున్నారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వ్రతంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు. సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు.

 

ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను గురువారం ఆలయంలో ఆవిష్కరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు కోరారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *