
అనకాపల్లి జిల్లా డెమోక్రసీ ప్రతినిధి సీతా గణేష్
బుచ్చయ్యపేట మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యేక ఐక్యతను చాటుతున్నారు.ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, మెటీరియల్ సేకరణ, రికార్డుల సిద్ధం తదితర పనుల్లో స్వయంగా పాల్గొంటున్నారు.తమకు కేటాయించిన విధులకే పరిమితం కాకుండా, అవసరమైన చోట ఒకరికొకరు సహకరించుకుంటూ బాధ్యతలను పంచుకుంటున్నారు.హోదాలు,వ్యక్తిగత బాధ్యతలను పక్కనపెట్టి ఒకే బృందంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.విధుల పట్ల అంకితభావం,పరస్పర సహకారం,ఆల్ సెక్రటరీస్ ఐక్యత పలువురి ప్రశంసలు అందుకుంటోంది.ఎన్నికల విధుల్లో సమిష్టి కృషికి బుచ్చయ్యపేట మండల కార్యదర్శులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Leave a Reply