వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కాసగాని శ్రీధర్ బాధ్యతల స్వీకరణ

 

డెమోక్రసీ రైట్స్ వెంకటాపురం నూగురు ప్రతినిధి

ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన వెంకటాపురం సర్కిల్ కార్యాలయంలో అధికారికంగా విధుల్లో చేరి బాధ్యతలు చేపట్టారు.

 

ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు పోలీసు శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని,చట్టపరిధిలో వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు శాఖపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *